'లెజెండ్' సినిమాకు అవార్డులు ఇవ్వడానికి కారణం ఇదే!: జ్యూరీ మెంబర్ ప్రసన్నకుమార్

  • భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఇందులో మెసేజ్ ఉంది
  • అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేలపై చర్చ ఉంది
  • అందుకే అవార్డు ఇచ్చాం
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు టాలీవుడ్ లో వేడిని రగిల్చాయి. ఏకపక్షంగా అవార్డులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 ఏడాదికి గాను 'లెజెండ్' సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల కూడా కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల జ్యూరీ సభ్యుడు ప్రసన్నకుమార్ ఈ అంశం గురించి ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడారు.

'లెజెండ్' సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం సరైంది కాదని అన్నారు. వారి వాదన తప్పు అని చెప్పారు. ఈ సినిమాలో అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్ ఉందని అన్నారు. భ్రూణ హత్యలను వ్యతిరేకిస్తూ ఓ సన్నివేశంలో హీరో మాట్లాడతాడని... అలాగే, రాజకీయాల్లో అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేల గురించి ఈ సినిమాలో చర్చ ఉందని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించామని తెలిపారు.
Go Back to Shorts
legend
legend movie
nandi awards

More Telugu News